శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాల రోడ్డులో ఉన్న ఆర్‌సీఎం సహాయ మాత ఆలయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అతి పెద్ద ప్రార్థనా మందిరంగా పేరు పొందింది. 2007లో దీన్ని బిషప్ ఇన్నయ్య ప్రారంబించారు. సుమారు వంద అడుగుల పొడవుతో ఎత్తైన నిర్మాణాలు, ఇతర కళారూపాలు ఫైబర్ గ్లాసులో అమర్చిన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. సుమారు రెండు వేల మంది ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 15నుంచి 22 వరకు ప్రతి గ్రామానికి, ఇంటికి వెళ్లి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెపుతూ కేరల్స్ నిర్వహిస్తున్నట్లు ఫాదర్ భుషణ్ తెలిపారు. 24 రాత్రి 11 గంటల నుంచి 2గంటల వరకు క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయని, 25 ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రార్థనలు జరుగుతాయని వివరించారు.
–శ్రీకాకుళం కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment