తీర ప్రాంత పరిరక్షణకు చర్యలు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: తీర ప్రాంత పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. తీర ప్రాంత భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తొలుత సమీక్షించారు. సముద్రతీర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద గస్తీ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకోసం గజ ఈతగాళ్లను ఏర్పాటుచేయాలని ఎస్పీ కోరారు. వాచ్ టవర్స్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తీరప్రాంతాల్లో హోర్డింగ్స్, బారువ, కళింగపట్నం ప్రాంతాల్లో లైఫ్ జాకెట్స్, బోట్స్ అవసరమని సభ్యులు కోరగా కలెక్టర్ తదుపరి చర్యలు నిమిత్తం సంబంధిత అధికారులను ఆదేశించారు. సముద్రం వేటకు వెళ్లే మత్స్యకారులు మత్స్యశాఖ జారీ చేసే బయోమెట్రిక్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకువెళ్లడం లేదని తెలియజేయడంతో మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో కోస్టల్ గార్డ్ ఎస్పీ రవి వర్మ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.రాము, మత్స్య శాఖ ఉపసంచాలకులు పీవీ శ్రీనివాసరావు, సహా య సంచాలకులు టి.సంతోష్ కుమార్, తీర ప్రాంత సీఐలు, ఎస్ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment