పెట్రోల్ బంక్‌లో మంటలు
టెక్కలి: స్థానిక పాత జాతీయ రహదారిలో గల ఆయుష్ పెట్రోల్ బంక్‌లో గల ఫిల్లింగ్ పంప్‌లో గురువారం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. పట్టణానికి మధ్యలో వేలాది లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వలతో ఉన్న బంకులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందోనని సమీప ప్రాంతాలకు చెందిన స్థానికులు, వ్యాపారులు భయపడ్డారు. బంక్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫిల్లింగ్ పంపు మా ర్పు చేసే క్రమంలో ఒక్క సారిగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. అయితే పెట్రోల్, డీజిల్ నిల్వలు కలిగిన ట్యాంకుల వద్ద ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫిల్లింగ్ పంపు మెషిన్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని బంక్‌లో మంటలు వ్యాపించడంపై విచారణకు ఆదేశించారు. అలాగే టెక్కలి సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ రాముతో పాటు ఆర్‌ఐ ఢిల్లేశ్వరరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఫిల్లింగ్ పంపులు మార్పు చేస్తుండగా ఘటన
భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు
అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment