చలిగాలులు.. చిరు జల్లులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయి. వాతావర ణం చల్లబడి, చలి కూడా పెరిగింది. చాలా గ్రామాల్లో వరి కోతలు పూర్తయ్యి పొలాల్లో కుప్పలు పెట్టి ఉన్నారు. వాటిని జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం నాటికి జిల్లాలో 99.00 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కంచిలిలో 17.2, కవిటిలో 14.0, జి సిగడాంలో 8.8, సరుబుజ్జిలిలో 6.2, సోంపేటలో 5.2, లావేరులో 4.2, బూర్జలో 4.2, టెక్కలిలో 4.0, పొందూరులో 3.8, ఎచ్చెర్లలో 3.4, రణస్థలంలో 3.2, శ్రీకాకుళంలో 2.8, ఇచ్ఛాపురంలో 2.6, ఆమదాలవలసలో 2.6, సంతబొమ్మాళిలో 2.4, సారవకోటలో 2.2, పలాసలో 2.2, గారలో 1.8, నందిగాంలో 1.6, పాతపట్నంలో 1.4, హిరమండలంలో 1.4, మెళియాపుట్టిలో 1.2, కోటబొమ్మాళిలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. మిగిలిన మండలాల్లో వర్షం కురవలేదు. అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి.
Comments
Please login to add a commentAdd a comment