వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనాలి
నరసన్నపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మండల కేంద్రాలు, నియోజక వర్గ కేంద్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ సమన్వయకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఇతర పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ సభ్యు లు, నాయకులు అందరూ పాల్గొనాలని సూ చించారు. అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలా గే నరసన్నపేటలో శనివారం ఆస్పత్రిలో పండ్లు పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రధాన నాయకులు అందరూ ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
పాతపట్నం: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయాధికారి ఎన్.బాలాజీ అన్నారు. పాతపట్నం బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా లక్ష్యాన్ని పెట్టుకుని చదువు కోవాలన్నారు. విద్యార్థుల వంట గది, మరుగుదొడ్లను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినుల భోజనం, కూరను పరిశీలించారు. పదో తరగతి, ఇంట ర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అర్చన, కొల్లివలస ప్రిన్సిపాల్ డి.దేవేంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టెన్త్ మోడల్ పేపర్ల ఆవిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి ఇంగ్లిష్ మీడియం మోడల్ పేపర్స్‌ను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆవిష్కరించారు. మంచి మార్కుల స్కోరింగ్‌కు ఉపయోగపడే ఈ పుస్తకాన్ని విద్యార్థులకు సరసమైన ధరలకు అందించడం మంచి పరిణామమని జాయింట్ కలెక్టర్ అన్నారు. యూటీఎఫ్ సంస్థ ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని కూడా చూడడం చాలా ఆనందించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్ కుమార్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శి హెచ్ అన్నాజీరావు, అకడమిక్ కమిటీ కన్వీనర్ ఎల్‌వీ చలం, కోదండ రామయ్య పాల్గొన్నారు.
కూర్మనాథుని సన్నిధిలో మైరెన్ ఎస్పీ రవివర్మ
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని తీర ప్రాంత రక్షణ దళం (మైరెన్) ఎస్పీ రవివర్మ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహాత్యాన్ని వివరించగా.. ఈవో జి.గురునాథరావు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు కళింగపట్నం మైరెన్ స్టేషన్‌ను తనిఖీ చేశా రు. తీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల వద్ద పర్యవేక్షించాలని సూచించారు. ఆయనతో పాటు కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బూర ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment