మిల్లర్లు నొల్లేస్తున్నారు
దోపిడీకి గురవుతున్నాం..
మేం మిల్లర్ల దోపిడీకి గురవుతున్నాం. తేమ, పొల్లు లేకపోయినా 80 కిలోల బస్తా దగ్గర మరో రెండున్నర కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. దీంతో నష్టం తప్పడం లేదు. – గొంటి రమేష్,
రైతు, ఎన్‌కేపురం కొత్తూరు మండలం
మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
తేమ, పొల్లు పేర్లతో అదనంగా రెండున్నర కిలోల ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లపై చర్యలు తీసుకో వాలి. రైతులను ఈ ఇబ్బందుల నుంచి కాపాడాలి.
– కృష్ణమోహన్, రైతు వైఆర్‌పేట, కొత్తూరు
ఫిర్యాదు చేయాలి
మిల్లర్లు ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని ఫిర్యాదు చేస్తే విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80 కిలోలు మాత్రమే తూకం వేయాలి.
– భీమారావు, సీఎస్‌డీటీ కొత్తూరు
కొత్తూరు: ధాన్యం కొనుగోలు రైతుల కంటే మిల్లర్లకు ఎక్కువగా లాభం చేకూరుస్తోంది. ధాన్యంలో ఎలాంటి తేమ లేకపోయినా 80 కిలోల బస్తా ను అదనంగా రెండున్నర కిలోలు తీసుకుంటున్నారు. దీంతో రైతులకు నష్టం తప్పడం లేదు. ఎకరాకు సుమారు రూ.1200 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారు. అదనంగా ఇవ్వకపోతే వారి నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని అదనపు తూకం సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment