నువ్వా.. నేనా!
● హోరాహోరీగా పాలిటెక్నిక్
స్పోర్ట్స్‌మీట్
● నేటితో ముగియనున్న పోటీలు
ఎచ్చెర్ల క్యాంపస్: సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రాంతీయ స్థాయి అంతర పాలిటెక్నిక్ క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారంతో ముగియనున్న ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాకుళం మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీవేంకటేశ్వరా పాలిటెక్నిక్ కళాశాల మైదానాల వేదికగా జరుగుతున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని పది ప్రభుత్వ, పైవేట్ కళాశాలల క్రీడాకారులు హాజరవుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బి.జానకి రామయ్య, పలువురు పీడీలు పర్యవేక్షిస్తున్నారు.
విజేతలు వీరే..
రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన క్రీడల్లో పలువురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బాల్‌బ్యాడ్మింటన్‌లో ఐతం పాలిటెక్నిక్ జట్టు ప్రథమ, వెంకటేశ్వరా పాలిటెక్నిక్ జట్టు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. చెస్‌లో కె.ప్రదీప్, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రథమస్థానం, కె.హరి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ ద్వితీయ స్థానం సాధించారు. మహిళల చెస్‌లో బి.రమ్యశ్రీవైష్ణవి, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ మొదటి, బి.హారిక శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ రెండో స్థానంలో నిలిచారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో కె.హర్షిత, ఎస్.గ్రీష్మ, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కె.కౌసల్య, సీహెచ్.తనుశ్రీ, తొలి రెండు స్థానాలు సాధించారు. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో పి.చంద్రమౌళి, కె.ఆనంద్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment