చెట్టుకొమ్మను తప్పించబోయి..
ఎల్.ఎన్.పేట: మండలంలోని ముంగెన్నపాడు జంక్షన్ సమీపంలో అలికాం–బత్తిలి రోడ్డుపై గురువారం ఇసుక ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ (5 స్టాప్) బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ ఉన్న వైపున రోడ్డు పక్కన భారీ చెట్టు కొమ్మ ఉంది. ఆ కొమ్మను తప్పించే క్రమంలో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్ తొట్టె బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గానీ, బస్సులో డ్రైవర్, ప్రయాణికులకు గానీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్‌టీసీ బస్సు
ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment