దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
● గున్నమ్మను పరామర్శించిన తిలక్
టెక్కలి: మండలంలోని చాకిపల్లిలో తెలుగుదేశం పార్టీ వర్గీయుల చేతిలో గాయపడి టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్ చుక్క గున్నమ్మ, ఆమె కుమార్తెను వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ గురువారం పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు మితిమీరుతున్నాయని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాధాన్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తిలక్‌తో పాటు నాయకులు జి.మోహనరెడ్డి, పి.రమణబాబు, బి.రాజేష్, కే.జీవన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment