కన్నీరే కడుపు నింపాలిక..
గార: బందరువానిపేటలో ముందుకు వచ్చిన సముద్రం
వజ్రపుకొత్తూరు /ఎచ్చెర్ల క్యాంపస్
వరుస తుఫాన్లు మత్స్యకారుల బతుకుల్లో అలజడి రేపుతున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబరు నెలల్లో జిల్లాపై తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా మత్స్య సంపద అధికంగా లభించే సమయంలో తుఫాన్లు వస్తుండడంతో గంగపుత్రులకు నష్టం తప్పడం లేదు. జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం 11 మండలాల్లో విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, సంతబొమ్మాళి, పోలాకి, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో సముద్రంలో చేపల వేట చేసి బతుకుతున్న మత్స్యకార కుటుంబాలు దాదాపు 16,569 ఉన్నా యి. వేట సాగితేనే వీరికి రోజులు గడుస్తాయి. ప్రస్తుతం వాతావరణం అనుకూలించక సంద్రంలోకి వెళ్లడమే కుదరడం లేదు. దీనికి తోడు అధికార కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కష్టాలపై కన్నెత్తి కూడా చూడడం లేదు. 2014–19 మధ్య కూడా మత్స్యకారులకు వేట నిషేధ భృతి పేరుతో అరకొరగా ఐదారు వేల మందికి కేవలం రూ.4000 అందజేసేవారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వంలో తేదీ చెప్పి మరీ రూ.10వేలు సాయం అందించారు. వేట నిషేధ సమయం ముగియగానే ఏటా మే నెల 2వ వారంలో గంగపుత్రుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు పడేవి. ఈ ఏడాది మాత్రం వేట నిషేధ భృతి ఊసే లేదు.
బెంగ తీర్చని భృతి..
ఏటా తుఫాన్లు, వేట నిషేధం కష్టాల నుంచి గంగపుత్రులను గట్టెక్కించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేట నిషేధ భృతి, మత్స్యకార భరోసా అనుకున్న సమయానికి వేసేది. డీజిల్ సబ్సిడీ నేరుగా పెట్రోల్ బంకుల వద్దే అమలు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల పథకాలన్నీ గాలి కొదిలేసింది. మత్స్యకార భరోసా రూ.20వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై కసరత్తు కూడా చేయలేదు.
ఏరివేత జాబితా సిద్ధం
జిల్లాలో 16 లక్షల టన్నుల చేపలు ఏడాదికి ఉత్పత్తి చేస్తుండగా, అందులో దాదాపు 5.60 లక్షల టన్ను ల చేపలు ఎండు చేపలుగా మార్చి కోళ్ల ఫారాలకు మేతగా తరలిస్తున్నారు. వేట సన్నగిల్లండంతో గత నాలుగు నెలలుగా ఉత్పత్తి తగ్గి గంగపుత్రులు తీవ్రంగా నష్టపోయారు. మత్స్యశాఖ మే నెలలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయగా నవశకం బెనిఫి షియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో ఆరు దశల్లో వడపోయగా 2423 మందిని అనర్హులుగా తేల్చారు. ఇందులో 100 లీటర్లు కనీస వినియోగం లేని మోటారు బోట్‌లలో పని చేస్తున్న 1890 మందికి అనర్హులుగా పేర్కన్నారు. దీంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.
గార: బందరువానిపేటలో ఒడ్డున ఉన్న పడవలు
వేట సాగటం లేదు
అల్పపీడనం, వాయుగుండాలు వల్ల వరుస తుఫాన్లు వస్తున్నాయి. చేపల వేటకు వెళ్లవద్దని అధికారులే దండోరాలు వేయిస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నాను. ఇస్తామన్న రూ.20వేల భరోసా ఇచ్చి ఉంటే ఖర్చులు గట్టెక్కేవి. అప్పుల భారం పెరిగిపోయి మా ఊరులో చాలా మంది గోవా, కాండ్లా వలస పోతున్నారు.
– సీహెచ్ నీలయ్య, మత్స్యకారుడు భావనపాడు
పరిహారం ఇవ్వాలి
తుఫాన్ల సమయంలో వేట కు వెళ్లవద్దని చెబుతున్న ప్రభుత్వం ఆ సమయంలో మాకు నష్టపరిహారం ఇవ్వాలి. డీజిల్ సబ్సిడీలు పెంచాలి. ఐదారుగురం కలిసి వేటకు వెళితే కనీసం డీజిల్ ఖర్చులు రావటం లేదు. ప్రభుత్వం వేట నిషేధ భృతి ఇవ్వడంతో పాటు ఆధునిక వేట సామగ్రి సబ్సిడీపై అందించాలి.
– జి.శంభూరావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట
వరుస తుఫాన్లతో మత్స్యకారుల
గుండెల్లో గుబులు
వేట సాగక ఇబ్బంది పడుతున్న
గంగపుత్రులు
గత పదేళ్లలో అక్టోబర్ –డిసెంబర్ మధ్య
13 తుఫాన్లు
రూ.20వేలు భృతి ఇస్తామంటూ
ఇవ్వని కూటమి ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment