చివరి రోజు క్రీడలు వాయిదా
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన అంతర్ పాలిటెక్నిక్ ప్రాంతీయ క్రీడలు శుక్రవారం ముగియాల్సి ఉండగా, వానల కారణంగా వాయిదా పడ్డాయి. శుక్రవారం వర్షం కారణంగా ఆటలు ప్రారంభం కాలేదు. దీంతో ముగింపు కార్యక్రమం వాయిదా పడింది. వాన లు తగ్గిన తరువాత విద్యార్థులకు సమాచారం ఇస్తామని, చివరి రోజులు క్రీడలు నిర్వహణ, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.జానకి రామయ్య శుక్రవారం తెలిపారు.
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు
కాశీబుగ్గ: చెక్‌బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ పలాస సివిల్ కోర్టు జడ్జి యు.మాధురి గురువారం తీర్పు ఇచ్చారు. శ్రీరామ్ చిట్స్ పలాస బ్రాంచ్‌కి బకాయి నిమిత్తం పలాసకి చెందిన తంగుడు శ్రీధర్ రూ.1,47,000కు చెక్ ఇచ్చారు. ఈ చెక్ తీసు కొని చిట్స్ యాజమాన్యం బ్యాంక్‌కు వెళ్లగా బౌన్స్ అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. కంపెనీని శ్రీధర్ మోసం చేశాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో పలాస జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్‌ఫస్ట్ క్లాస్ న్యాయ అధికారి విచారణ జరిపారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికు ఆరు నెలల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు
అరసవల్లి: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఈమేరకు ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ పొదుపు అవగాహనపై నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీ ల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, బహు మతులను ప్రదానం చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment