రైతులకు భరోసా కల్పించాలి
● ఎమ్మెల్సీ నర్తు రామారావు
ఇచ్ఛాపురం రూరల్: అకాల వర్షాలకు అతలాకుతలమైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన భరోసా కల్పించాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ వందలాది ఎకరాల పంట పొలాలు నీటిలోనే ఉన్నాయని, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత నాలుగు రోజులుగా జిల్లా రైతులు అవస్థలు పడుతున్నా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రంగుమారిన ప్రతీ ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేసి, ఒక్కో బాధిత రైతుకు ఎకరాకు రూ.40 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment