కబడ్డీ పోటీల్లో సిక్కోలు జయకేతనం
● జూనియర్స్ బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌గా శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం జట్లు మరోసారి మెరిశాయి. బాలబాలికల రెండు విభాగాల్లోనూ జయకేతనం ఎగురవేసి సిక్కోలు క్రీడల ఖ్యాతిని చాటిచెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వేదికగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్‌షిప్–2024 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బాలబాలికల రెండు విభాగాల్లోనూ యాదృచ్ఛికంగా శ్రీకాకుళం, విజయనగ రం జట్లు ఫైనల్ పోరులో తలపడ్డాయి. బాలురు జట్టు 39–18 పాయింట్ల తేడాతో, బాలికల జట్టు 32–16 పాయింట్ల తేడాతో విజయనగరం జట్లపై శ్రీ కాకుళం జట్లు విజయదుందుబీ మోగించాయి. జిల్లా కబడ్డీ సంఘ ముఖ్య ప్రతినిధి, పీడీ సాధు శ్రీనివాస్ జిల్లా జట్లను దగ్గరుండి ప్రోత్సహించి మెప్పించారు.
● సర్వత్రా హర్షతిరేకాలు
ఇదిలా ఉండగా జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్లు విజేతలగా నిలవడంపై క్రీడా వర్గాల్లో సర్వత్రా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, మెంటాడ సాంబమూర్తి, శ్రీకాకుళం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు, డీఎస్‌డీవో డాక్టర్ శ్రీధర్‌రావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, బీవీ రమణ, మెట్ట తిరుపతిరావు, కె.మాధవరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment