ఉద్దాన కళాకారులకు సత్కారం
పలాస: సమాజంలో జరుగుతున్న సమస్యలపై ఉద్దానం రచయితలు స్పందించి జనాన్ని జాగృతం చేసే రచనలు చేయాలని ఉద్దానం రచయితల సంఘం(ఉరసం) అధ్యక్షుడు కుత్తుం వినోద్ పిలుపునిచ్చారు. పలాస మండలం మాకన్నపల్లి గ్రామంలో బుధవారం ఉరసం ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్దానం ప్రాంతానికి చెందిన కళాకారులు, రచయితలు, కవులను ఘనంగా సన్మానించారు. బొడ్డపాడుకు జానపద కళాకారుడు గేదెల అప్పారావును కుత్తుం తాతారావు స్మారక పురస్కారం కింద రూ.5వేలు నగదు, జ్ఞాపిక , శాలువతో సత్కరించారు. అనంతరం నిశితాసి కవ్వం పుస్తకాన్ని ఆవిష్కరించి పరిచయం చేశారు. అందులోని పాటలను కుత్తుం వినోద్, వర్ధమాన గాయకుడు శాంతారావు, దానేసు, లత తదితరులు వినిపించారు. కార్యక్రమంలో జర్నలిస్టు పొట్టి శివకుమార్, రచయతలు కోనేరు ఆదినారాయణ, మడ్డు నాగేశ్వరరావు, బత్తిని వినోద్‌కుమార్, బత్తిన శాంతారావు, బోకర తిరుపతిరావు, డప్పు కళాకారుడు సొర్ర రామారావు, పోతనపల్లి కుసుమ, పోతనపల్లి లత, తెప్పల రవివర్మ, కుత్తుం ప్రసాద్, గొరకల లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment