రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని నెలివాడ జాతీయ రహదారి ఫ్‌లై ఓవర్ కింద అండర్‌పాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ద్విచక్ర వాహనంతో వస్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు, జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిసిని గ్రామానికి చెందిన ఇజ్జాడ త్రినాథ(50), అతని భార్య ఇజ్జాడ చిన్నమ్మ, అతని మేనల్లుడు మీసాల ప్రకాష్‌లు ముగ్గురు ద్విచక్ర వాహనంపై రణస్థలం మండలంలోని గిరివానిపాలేం వెళ్లి, తిరిగి నెలివాడ మీదుగా స్వగ్రామం పిసిని గ్రామానికి వస్తున్నారు. ఈ సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న మీసాల ప్రకాష్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. వెనుక కుర్చొన్న ఇజ్జాడ త్రినాథ, అతని భార్య ఇజ్జాడ చిన్నమ్మ అక్కడిక్కడే పడిపోయారు. అయితే త్రినాథ ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. త్రినాథ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఇతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీంతో పిసిని గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నారు. జేఆర్‌పురం ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరో ఇద్దరికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment