27న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

27న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ ఎంపికలు

Published Thu, Dec 26 2024 1:14 AM | Last Updated on Thu, Dec 26 2024 1:14 AM

-

శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళం టౌన్‌హాల్‌ వేదికగా ఈ నెల 27న జిల్లా స్థాయి ఫెన్సింగ్‌ క్యాడెట్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బలభద్రుని రాజా బుధవారం తెలిపారు. అండర్‌–17 విభాగంలో జరిగే ఈ ఎంపికలకు బాలబాలికలు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5గంటలలోగా పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటలకు టౌన్‌ హాల్‌ వద్దకు ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన ఐడీ కార్డు జిరాక్స్‌, ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం , వ్యక్తిగత ఫెన్సింగ్‌ మెటీరియల్‌తో హాజరుకావాలని కోరారు. 2008 జనవరి 1 నుంచి 2011 డిసెంబర్‌ 21 మధ్య జన్మించిన వారే అర్హులని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని ఈ నెల 28, 29వ తేదీలలో కాకినాడలో జరిగే ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ క్యాడెట్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2024–25 పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఫెన్సింగ్‌ కోచ్‌ జోగిపాటి వంశీ(7660874844)ని సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement