వైభవంగా కాలభైరవ నిమజ్జనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: బలగ నాగావళి తీరంలోని బాలత్రిపుర కాలభైరవ పీఠం దేవాలయంలో బుధవారం కాలభైరవ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. పీఠం నిర్వాహకులు గణేష్ గురూజీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అనంతరం కాలభైరవ దీక్షాపరులు స్వామివారి విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా నాగావళి నదికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఏరులై పారిన మద్యం!
● హైవేలో లారీ నుంచి జారిపడిన వైన్ బాక్సులు
● బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
కాశీబుగ్గ : పలాస మండలం పారసాంబ గ్రామం వద్ద జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారింది. శ్రీకాకుళం వైపు నుంచి పలాస వస్తున్న వాహనం నుంచి పారసాంబ వద్ద వైన్ బాటిళ్లు జారిపడ్డాయి. కొన్ని సీసాలు పగిలిపోవడంతో రోడ్డుపైనే మద్యం పారింది. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు, మందుబాబులు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. అనంతరం నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రోడ్డుపై ఉన్న గాజు పెంకులను తొలగించారు. కాశీబుగ్గ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment