ఆరుగురిపై గృహ హింస కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని బడివానిపేట పంచాయతీ జాలారుకొయ్యాం గ్రామానికి చెందిన మహిళ మారుపల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఎచ్చెర్ల పోలీసులు ఆరుగురిపై గృహహింస కేసు నమోదు చేశారు. ఈమె భర్త సత్యం కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ప్రస్తుతం ఆత్త టిట్టమ్మ, మరో ఐదుగురు కుటుంబ సభ్యులు రోజూ హింసిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు.
గంజాయితో
ఇద్దరు వ్యక్తులు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి అక్రమంగా ఉత్తరప్రదేశ్‌కి 11.430 కేజీల గంజాయిని తరలించేందకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. సీఐ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రం మాణిఖ్యపూర్ ఏరియా బడగడకు చెందిన అపాలోమండల్ నుంచి 11.430 కేజీల గంజాయిని కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తరలించేందుకు ఒడిశా నుంచి వస్తుండగా ఎల్‌సీగేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం పట్టుబడ్డారు. పట్టుబడినవారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా ఝందాపూర్ గ్రామానికి చెందిన అజయ్, అదే రాష్ట్రానికి చెందిన బులంద్‌షేహర్ జిల్లా సుజనా గ్రామానికి అజయ్‌సింగ్ ఉన్నారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లో గంజాయి వ్యాపారం చేస్తున్న సోను అనే వ్యక్తికి గంజాయిని అందజేసేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా జరగకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ఇచ్ఛాపురం పోలీస్ సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అభినందించినట్లు సీఐ వెల్లడించారు. ఇందులో రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment