బయటపడిన మోసం
టెక్కలి: మండలంలోని గూడేం పంచాయతీ పిట్టలసరియా గ్రామానికి చెందిన వెలుగు సీఎఫ్ గంగయ్య అటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు, ఇటు యూనియన్ బ్యాంకుకు చేసిన మోసం బాధిత సభ్యుల సమక్షంలో బహిర్గతమైంది. ఈ మేరకు ఇటీవల సాక్షిలో ప్రచురితమవుతున్న కథనాలకు స్పందించి సోమవారం వెలుగు సీసీ కె.శ్రీరాములు, ఏపీఎం ఉమారాణి తదితరులు బ్యాంకు స్టేట్‌మెంట్ పత్రాలతో సహా పిట్టలసరియా గ్రామంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో భాగంగా సీఎఫ్ గంగయ్య చేసినటువంటి మోసం సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. యూనియన్ బ్యాంకులో తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ వాయిదాల చెల్లింపుల విషయంలో సభ్యులు సీఎఫ్‌కు ఇచ్చినటువంటి వాయిదా డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుని, నకిలీ బ్యాంకు రశీదులను సభ్యులకు చూపించి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిన విషయం తేటతెల్లమైంది. దీనిపై వెలుగు అధికారులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులకు, బ్యాంకుకు మోసం చేసిన సీఎఫ్ గంగయ్యను విధుల నుంచి నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అయితే శాఖాపరంగా ప్రాథమిక చర్యలు తీసుకున్నప్పటికీ బ్యాంకుపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో బ్యాంకు సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంది.
నకిలీ బ్యాంకు రశీదుల వ్యవహారంపై విచారణ
సీఎఫ్ సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేటతెల్లం
Comments
Please login to add a commentAdd a comment