‘మాకు రక్షణ కల్పించండి’
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని బలగ మెట్టు కూడలి డీసీసీబీ బ్రాంచి సమీపంలో ఓ ఇంటి యజయానికి కొందరు విలేకరులంటూ చెప్పుకుని డబ్బులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రెండో పట్టణ పోలీసులు ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు చేయగా బాధిత దంపతులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలవడానికి వచ్చారు. ఆయన లేకపోవడంతో తమ కుటుంబానికి ప్రాణ రక్షణ క ల్పించాలంటూ డీఎస్పీ సీహెచ్ వివేకానందకు విన్నవించారు. పాల వ్యాపారం చేసుకుంటూ తమ కు టుంబం బతుకుతోందని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని బాధిత దంపతులు పేర్కొన్నారు. మతిస్థిమితం లేని తన మరిది కోసం ఇల్లు కట్టుకుంటుంటే అర్ధరాత్రి వచ్చి డబ్బుల కోసం బెదిరించారని బాధితురాలు సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. డోల అప్పన్న అనే వ్యక్తి కూడా అక్కడకు చేరి వారితో కలిసిపోయారని తెలిపారు. వారి బెదిరింపులకు బెదిరిపోయిన తన భర్త సుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయని, పని కోసం వచ్చిన వాళ్లను కూడా వారు బెదిరించారని ఫిర్యాదు చేశారు. భవిష్యత్‌లో వారు తమను ఇబ్బంది పెట్టకుండా రక్షణ కల్పించాలని కోరారు.
తప్పుడు కేసులపై చర్యలు తీసుకోవాలి
తమపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టి ఇరికించాలని చూసిన బిడ్డిక రాజారావుపై, అతడిని ప్రోత్సహించిన డోల అప్పన్న, తిత్తి ప్రవీణ్‌లపై కేసులు నమోదు చేయాలని అగ్నివర్ష దినపత్రిక ఎడిటర్ నాగేశ్వర ఈశ్వరరావు, ఏపీ న్యూస్ దినపత్రిక వర్కింగ్ ఎడిటర్ మొకర మల్లేశ్వరరావులు డీఎస్పీ సీహెచ్ వివేకానందను కోరారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బూచిగా చూపి భయపెట్టడం బిడ్డిక రాజారావు, డోల అప్పన్న, తిత్తి ప్రవీణ్‌ల దందాల్లో ఓ భాగమని, వారి అక్రమాలు, వారు చేస్తున్న తప్పుడు ఫిర్యా దులపై పోలీసుల వద్దకు వచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదన్నారు. అప్పన్న, ప్రవీణ్‌ల సూచనలతో ఖాళీ జాగాలను కబ్జా చేయడం రాజారావుకు నిత్యకృత్యమని, శాంతినగర్ కాలనీలో ఇలానే ఓ స్థలాన్ని కబ్జా చేసి ఫేక్ మానవ హక్కుల బోర్డు తగిలించారని, భూ వివాదాల్లో తలదూర్చడం, అమాయకులను అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడం వీరి దందాల్లో భాగమన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment