పొందూరులో ప్రబలిన డయేరియా
పొందూరు: పొందూరులో డయేరియా వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. డయేరియా ప్రబలుతూ రోజు రోజుకూ విస్తరిస్తూ పోతోంది. మూడు రోజుల క్రితం డయేరియా వ్యాధి సోకడంతో బాధితులను పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం స్థానిక కస్పావీధిలో 15 మంది వరకు డయేరియాతో బాధపడుతున్నారు. బాధితులను పొందూరు సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో తాడివలస పీహెచ్‌సీ వైద్యుడు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కస్పావీధిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కస్పావీధిలో డయేరియా వ్యాధి ప్రబలతుండటంతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, డీఎంహెచ్‌ఓ టీవీ బాలమురళి కృష్ణతో కలిసి వీధుల్లో తిరిగి బాధితులను పరామర్శించారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీల సిబ్బందికి ఎమ్మెల్యే పలు సూచనలిచ్చారు. రానున్న పండుగ వాతావరణంలో డయేరియా కేసులు పూర్తిగా ఉండకూడదని వైద్య సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి చెప్పారు. అనంతరం డీఎంహెచ్‌ఓ పొందూరు సీహెచ్‌సీలో డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు.
మినీ జాబ్‌మేళా వాయిదా
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరగనున్న మినీ జాబ్‌మేళాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో జాబ్‌మేళాను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి జాబ్‌మేళా నిర్వహణపై సమాచారం
అందజేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment