ఓటర్ల తుది జాబితా రెడీ | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల తుది జాబితా రెడీ

Published Tue, Jan 7 2025 12:54 AM | Last Updated on Tue, Jan 7 2025 12:54 AM

ఓటర్ల తుది జాబితా రెడీ

ఓటర్ల తుది జాబితా రెడీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితా(ఎస్‌ ఎస్‌ ఆర్‌ 2025)ను జిల్లా ఎన్నికల అధికారి వారి తరఫున జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జనవరి 5వ తేదీ నాటికి 18,80,065 మంది ఓటర్లుగా నమో దు చేసుకున్నట్లు చెప్పారు. 9,31,640 మంది పురుష ఓటర్లు, 9,48,299 మంది మహిళా ఓట్లర్లు, 126 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. 2025 లో 18–19 వయసు గల యువత 19,315 మంది ఎలక్టోరల్స్‌ గా నమోదు చేసుకున్నట్లు, 80 ఏళ్లు దాటినవారు 31,609 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండటం విశేషమని వెంకటేశ్వరరావు అన్నారు, ఆయతనోపాటు సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు ఉన్నారు.

నియోజకవర్గం పురుష ఓటర్లు మహిళలు ఇతరులు

ఇచ్ఛాపురం 1,31,396 1,38,165 17

పలాస 1,07,496 1,12,414 21

టెక్కలి 1,17,977 1,18,694 09

పాతపట్నం 1,12,513 1,13,168 09

శ్రీకాకుళం 1,35,562 1,38,333 29

ఆమదాలవలస 96,094 97,610 15

ఎచ్చెర్ల 1,23,370 1,21,988 13

నరసన్నపేట 1,07,232 1,07,927 13

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement