కాలిపోయింది
శ్రీకాకుళం క్రైమ్ :
జిల్లా కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమా దం సంభవించింది. ప్రాణనష్టమైతే జరగలేదు కానీ ఆస్తినష్టమైతే భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు సుమారు తొమ్మిది గంటల సేపు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో విశాఖ నుంచి వచ్చిన బ్రోన్టో స్కై లిఫ్ట్ యంత్రం సహా పది యంత్రాలు, రెండు క్రేన్లు, మూడు జేసీబీలు, 80 మంది ఫైర్ సిబ్బందితో పాటు రీజనల్ అగ్నిమాపక అధికారి డి.ని రంజన్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద, జిల్లా అగ్నిమాపక సహాయాధికారి వరప్రసాదరావు తీవ్రంగా శ్రమించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సీపీయూలో విద్యుత్ షార్ట్‌షర్క్యూట్ అవ్వడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని డీఎఫ్‌ఓ మోహనరావు అన్నారు.
ప్రమాదం ఇలా..
శనివారం ఉదయం 7.55 గంటలకు..
షాపింగ్‌మాల్‌లో ఫైర్ అలారమ్ మోగింది. నైట్ వాచ్‌మెన్‌గా ఉన్న కనకం మోహన్‌కుమార్, విజయ్‌కుమార్‌లు కుడివైపున ఉండే షాపింగ్‌మాల్ గోడవైపు చూడగా ఏసీ బాక్స్ ఉండే వైపు నుంచి పొగలు రావడం గుర్తించారు. వెంటనే తమ సూప ర్ వైజర్ వై.రమణకు ఫోన్ చేసి చెప్పారు. అతను మేనేజర్ ఉమామహేశ్వరరావు, సురేష్‌లకు ఫోన్ చేసి చెప్పడంతో అంతా అక్కడకు చేరుకున్నారు.
ఉదయం 8:19 గంటలకు..
ఫైర్‌స్టేషన్‌కు కాల్ వెళ్లింది. రెండు నిమిషాల్లోనే రెండు అగ్నిమాపక శకటాలతో ఏడీఎఫ్‌ఓ వరప్రసాద్ తమ సిబ్బందితో పాటు వచ్చారు. ముందుగా విషయాన్ని తెలుసుకున్న అధికారులు మా ల్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది నిచ్చెనలు వేసుకుని ఫస్ట్‌ఫ్లోర్‌లో చూశారు.
ఏదీ భద్రత..?
గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రధాన ద్వారం తప్ప వెలుపలకు వెళ్లే (ఎగ్జిట్) మార్గం లేకపోవడం, మాల్‌కుడివైపున రక్షణగోడకు, మాల్ గోడకు డిస్టెన్స్ కూడా 12 నుంచి 15 అడుగులే ఉండటంతో లోపలికి శకటాలు వెళ్లవని అధికారులు గుర్తించారు. అంతేకాక కుడి, ఎడమ, వెనుక భాగం గోడలు క్లోజ్ చేసి ఉండటం, వెంటిలేషన్‌కు కూడా అవకాశం లేకపోవడంతో లోపలికి గాలి వెళ్లలేక బయటకు పొగ వస్తుందని, మంటలు సంభవించి ఉంటాయని అప్పటికే అంచనాకు వచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఫైర్‌కు సంబంధించి జనరేటర్ ఉన్నా దానికి సంబంధించి నీటి వాల్వ్‌లు పై ఫ్లోర్‌లో ఉండి అవి క్లోజ్ అవ్వడం, మెట్లు మార్గం మూడు ఫ్లోర్లకే ఉండటం ఇవన్నీ, కనీసం ఇసుకను నింపే బకెట్లు లేకపోవడం ఫైర్ సేఫ్టీ లోపం కొట్టొచ్చినట్లు అధికారులకు కనిపించాయి.
మరికొన్ని యంత్రాలతో..
ముందుగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గ్లాసెస్ బద్దలుగొట్టగా ఉవ్వెత్తున పొగలు బయటకు రావడం మొదలయ్యాయి. లోపలకు ఎవరూ వెళ్లలేకపోయారు. అప్పటికే టౌన్ డీఎస్పీ వివేకానంద, సీఐ ఈశ్వరరావులు మూడు జేసీబీలు తెప్పించి మొద టి ఫ్లోర్‌లోని గ్లాసెస్ బద్దలుగొట్టారు. గోడను, పక్క గోడను విరగ్గొట్టడం మొదలు పెట్టారు. సరిగ్గా 10:15 గంటలకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు ఎగిసిపడటం కనిపించాయి. అప్పటికే నాలుగు ఫైరింజిన్లు, ఒక రెస్క్యూ టెండరింగ్ ఇంజిన్ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించలేదు. ఉదయం 11:30 గంటలకు స్కై లిఫ్ట్ వచ్చింది. అప్పటికే నరసన్నపేట, ఆమదాలవలస, రణస్థలం నుంచి ఫైరింజిన్లు రావడం, సరిగ్గా 11:30 గంటలకుబ్రోన్టో స్కైలిఫ్ట్ యంత్రాన్ని వెంటపెట్టుకుని ఆర్‌ఎఫ్‌ఓ నిరంజన్‌రెడ్డి పదిమంది సిబ్బందితో సహా విశాఖపట్నం నుంచి వచ్చారు.
ఆస్తినష్టం ఇదేనా..
గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే మంటలు చెలరేగడం, మిగతా
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది (ఇన్‌సెట్లో) షాపింగ్‌మాల్ లోపల మంటల్లో కాలిపోతున్న బట్టలు
మూడు ఫ్లోర్లకు పొగలు వ్యాపించడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే బట్టలు కాలాయని, మిగతా ఫ్లోర్లలో కాలలేదని డీఎఫ్‌ఓ మోహనరావు అన్నారు. కాకపోతే అంతా పొగమయమైందన్నారు. యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వకపోవడంతో ఇంకా ఆస్తి నష్టం అంచనా వేయలేదని చెప్పారు. పక్కనే ఉన్న సీఎంఆర్, ఆర్‌కే తదితర షాపింగ్‌మాల్స్‌లో ఉన్న సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి కాలిన బట్టలను బయటకు తీసేందుకు సహకరించారు.
స్కైలిఫ్ట్ యంత్రంతో షాపింగ్‌మాల్ పైకి వెళ్తున్న సిబ్బంది
స్కైలిఫ్ట్ పనిచేసిందిలా..
సుమారు 36 అంతస్తుల (90 మీటర్లు) పైభాగానికి వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ స్కై లిఫ్ట్ యంత్రానికి సంబంధించి 10 మంది సిబ్బంది వచ్చారు. లీడింగ్ ఆపరేటర్ సతీష్, మరికొందరు అంతస్తుపై భాగం వరకు వెళ్లి అందులో ఎవరు చిక్కుకున్నదీ, లేనిదీ ముందుగా గమనించారు. అనంతరం 11:55 గంటలకు వేరే నీటి శకట యంత్రానికి డెలివరీ ఓజ్ బిగించి దాని ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు అదుపులోకి రాకపోవడంతో క్రేన్ సాయంతో గోడ విరగ్గొట్టారు. ఆపసోపాలు పడుతూ మొత్తానికి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలను ఆ పగలిగారు. చివరకు ఎట్టకేలకు సాయంత్రం 5:30 గంటలకు మంటలను అదుపులోకి తేగలిగారు.
శ్రీకాకుళం సౌత్ ఇండియా
షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ వల్లనే ఘటన
10 అగ్నిమాపక శకటాలతో 9 గంటల పాటు శ్రమించిన 80 మంది సిబ్బంది
రూ.కోట్లలోనే నష్టం
Comments
Please login to add a commentAdd a comment