రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ, శ్రీకాకుళం పాతబస్టాండ్: రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాల మైదానం వేదికగా ఆదివారం జరిగే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ శనివారం పరిశీలించారు.
‘ఉత్తమ’జాబితా సిద్ధం
రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 81 శాఖల నుంచి 235 మంది ఉద్యోగులకు అవార్డులు అందజేయనున్నారు. వీరిలో జిల్లా అధికారులు 13 మంది. ఎన్జీవోల నుంచి మరో ఇద్దరికి అవార్డులు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment