అవార్డు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డు లభించింది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనలో, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పని తీరు కనబరిచినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా శనివారం విజయవాడలో అవార్డును ప్రదానం చేశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం తహసీల్దార్ సీహె చ్ గణపతి, పలాస బీఎల్‌ఓ ఐ.నీలవేణి, శ్రీకాకుళం బీఎల్‌ఓ వంజరాపు జగన్నాథరావు, కలెక్టరేట్ సి సెక్షన్ టెక్నికల్ సపోర్టర్ ఎం.సత్యనారాయణ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment