గంగపుత్రులపై క్షుద్ర రాజకీయం
●కక్షపూరితం
స్థానికంగా ఉన్న సర్పంచ్ రామారావు మా వర్గానికి చెంది న వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. గార మండలం, బలరామపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను మా ఊరికి తీసుకువచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా వలలను బలవంతంగా కత్తిరించి పట్టుకుపోయారు. ఒక్కో వలపై 20 కుటుంబాలు బతుకుతున్నాం.
– మైలపల్లి మూర్తి, రామనర్సయ్యపేట
●గ్రామంలో తగాదాలు
జరుగుతున్నాయి
రెండు వర్గాల మత్స్యకారుల మధ్య తగాదాలు జరు గుతున్నాయి. కొన్ని రోజుల వరకూ చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెడతాం. రింగ్ వలల నిషేధం కొన్ని చోట్ల ఉంది. చాలా చోట్ల లేదు. ఈ రింగ్ వలల వల్లే పెదగనగళ్లవానిపేటలో తగాదాలు జరుగుతున్నాయి.
– పీవీ శ్రీనివాస్, డీడీ ఫిషరీస్
శ్రీకాకుళం రూరల్:
రాజకీయ కక్ష సాధింపులు నాయకులను దాటి సామాన్యుల వరకు చేరుకున్నాయి. రాజకీయ కారణాలు చూపి గ్రామాల్లో చోటా నేతలు సామాన్యుల ను వేధించడానికి పూనుకుంటున్నారు. శ్రీకాకుళం మండల పరిధిలోని పెదగనగళ్లవానిపేట పంచాయ తీ పరిధిలో మత్స్యకారులకు జీవనాధారమైన చేపల వేటపై అధికార పక్ష నాయకుడు క్షుద్ర రాజకీయం చేస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా అధికారులకు ఫిర్యాదులు చేసి వారిని ఉసిగొల్పి మత్స్యకారులు వేట చేయకుండా ఆపించేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎక్క డా లేని ఆంక్షలు కేవలం పెదగనగళ్లవానిపేటకు చెందిన మత్స్యకారులపై అధికారులు పెట్టడంతో ఆ తీర ప్రాంతవాసులంతా రోడ్డున పడ్డారు.
జిల్లాలోని మత్స్యకార ప్రాంతాలైన రణస్థలం, కె.మత్స్యలేశం, వజ్రపుకొత్తూరు, భావనపాడు, మంచినీళ్లపేట, ఏడూళ్లపేట, గద్దెలపాడు తదితర మత్స్యకార ప్రాంతాలైన గ్రామాల్లోని గంగపుత్రులు రింగ్ వలలతోనే చేపల వేట సాగిస్తున్నారు. కర్ణాటక, మంగుళూరు, కేరళ, తమిళనాడు, గుజరాత్ ప్రాంతాల్లో సైతం రింగ్ వలలనే వాడుతున్నారు. పెదగనగళ్లవానిపేటలోనూ రింగ్ వలలతోనే ముప్పై ఏళ్లుగా చేపల వేట చేస్తున్నారు. అయితే ఇటీవల టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో కొందరు రింగ్ వలలు ఉపయోగించకూడదని ఆదేశం ఇచ్చారు. కానీ మిగతా వారు ఆ మాటలు పట్టించు కోకుండా రింగ్ వలలు వాడుతుండడంతో మత్స్య శాఖ అధికారులకు టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశాడు. రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతుండడంతో మత్స్యశాఖ అధికారులు కూడా రింగ్ వలలు వాడకూడదని నిషేధం విధించారు. అయితే జిల్లాలో ఎక్కడా లేని విధంగా తమకే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని వారు ప్రశ్నించినా ఎవరూ స్పందించలేదు. దీంతో వారు మళ్లీ వేటకు వెళ్లగా.. సముద్రంలో వారిని అడ్డుకుని వలలు కోసేశారు. ఫలితంగా వారం రోజులుగా వేట లేదు.
ముప్పై ఏళ్లుగా రింగ్ వలలే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులు
రాజకీయ కక్షతో వలల కత్తిరింపునకు పాల్పడిన వైనం
పెద్దగళ్లవానిపేటలో మత్స్యకారుల ఆవేదన
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తామన్న మత్స్యకారులు
Comments
Please login to add a commentAdd a comment