![శాలిహ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/lordkrishna_mr-1738869512-0.jpg.webp?itok=XIK255Zq)
శాలిహుండం.. సర్వ సన్నద్ధం
విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం..
ఏటా స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కొండపైకి దివ్యాంగులు వెళ్లేందుకు కింది నుంచి వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం.
– సుగ్గు మధురెడ్డి,
ఆలయ వంశపారంపర్య ధర్మకర్త
● నేటి నుంచి కాళీయ మర్ధన సంతాన వేణుగోపాలుని యాత్ర
● 8న వంశధార నదిలో చక్రతీర్థ స్నానం
● 12న తిరుక్కల్యాణ మహోత్సవం
గార: శాలిహుండంలోని శ్వేతగిరిపై వేంచేసిన కాళీయ మర్ధన వేణుగోపాలస్వామి యాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ఏటా భీష్మ ఏకాదశి నాడు నిర్వహించే ఈ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముందు రోజు సాయంత్రం నుంచి దూర ప్రాంత భక్తులు ఇక్కడకు విచ్చేసి రాత్రి బస చేస్తారు. శుక్రవారం సాయంత్రం పరిసర గ్రామాల్లో స్వామి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. శనివారం ఉదయం వంశధార నదిలో వేణుగోపాలస్వామి, లక్ష్మీనృసింహ స్వామి వార్లను రెండు పల్లకీల్లో తీసుకొని వెళ్లి సంప్రదాయబద్ధంగా చక్రతీర్థ స్నానాలు చేయిస్తారు. 12వ తేదీన తిరుక్కల్యాణం నిర్వహిస్తారు.
ప్రత్యేక ఏర్పాట్లు
స్వామినిభక్తులు సులువుగా దర్శించుకొనేందుకు వీలు గా బ్యారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వేల సంఖ్య లో లడ్డూలను తయారుచేస్తున్నారు. క్యూలో ఉన్న భ క్తులకు తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశామని కమీటీ సభ్యులు తెలిపారు. ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అధికారులు తెలిపారు.
సంతాన
వేణుగోపాలుడు..
భీష్మ ఏకాదశి రోజున జరిగే స్వామి చక్రతీర్థ స్నానంలో పాల్గొని, కొండపై వ్రతమాచరించి ఉపవాసం చేసి స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే దాసురాళ్లు, దాసుళ్లు తరలివచ్చి స్వామికి పూజలు చేసి విభూతి ఉండలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేస్తారు. శాలిహుండం యాత్ర తర్వాతే ఇంటి దగ్గర సంబరాలు చేసుకోవడం చాలా మందికి పరిపాటి.
![శాలిహుండం.. సర్వ సన్నద్ధం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06cto82-280004_mr-1738869512-1.jpg)
శాలిహుండం.. సర్వ సన్నద్ధం
![శాలిహుండం.. సర్వ సన్నద్ధం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06cto82b-280004_mr-1738869512-2.jpg)
శాలిహుండం.. సర్వ సన్నద్ధం
![శాలిహుండం.. సర్వ సన్నద్ధం 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06cto82dr-280004_mr-1738869512-3.jpg)
శాలిహుండం.. సర్వ సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment