ఽథర్మల్ పవర్ ప్లాంట్ వద్దే వద్దు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిసర గ్రామాల పరిధిలో క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం వినాశనానికి దారి తీస్తుందని, దీని వల్ల ఆయా మండలాల పరిధిలో 23 గిరిజన గ్రామాలు ప్రజలు నిరాశ్రయులవుతారని మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తమ్మినేని సీతారాం అన్నా రు. ఆయన గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్లాంట్ నిర్మాణం చేపడితే ఆదివాసీల బతుకులు బుగ్గిపాలవుతాయని అన్నారు. గతంలో సోంపేట, కాకరాపల్లిలో ఏం జరిగిందో పాలకుల కు గుర్తు లేదా అని ప్రశ్నించారు. వంశధారలో నీరు మొదటి పంటకే సరిపోవడం లేదని, ప్లాంట్‌కు నీటిని మళ్లిస్తే పొలాలకు ఎలా నీరందుతుందని అన్నారు. రిజర్వాయర్‌లోని నీటిని ప్లాంటుకు తరలిస్తే వేలాది ఎకరాల పంట భూములు బీడు గా మారుతాయన్నారు. శ్రీకాకుళానికి థర్మల్ వ్యతిరేక ఉద్యమాలు చేపట్టిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయాన్ని కాదని ప్లాంట్ నిర్మాణానికి ఉపక్రమిస్తే ప్రజా పక్షాన వైఎస్సార్‌సీపీ నాయకులమంతా ఉద్యమిస్తామని అన్నారు. శుక్రవారం సరుబుజ్జలి, బూర్జ మండలాల్లో గిరిజన మేధావుల కమిటీ పర్యటిస్తుందని, వారికి కూడా వినతి పత్రాన్ని అందించనున్నామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, బూర్జ, సరుబుజ్జలి జెడ్పీటీసీలు రామారావు, సురవరపు నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షులు కింజరాపు సురేష్, పార్టీ ముఖ్యనాయకులు పేడాడ చిరంజీవి, సురేష్, రవి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
Comments
Please login to add a commentAdd a comment