సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కల్లు గీత కులాలకు కేటాయించిన మద్యం దుకాణాలపై టీడీపీ నాయకుల కన్నుపడింది. వాటిని ఎలాగైనా కొట్టేయడానికి వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆ కులాల్లోని కొందరిని బినామీలుగా పెట్టి దరఖాస్తులు చేయిస్తున్నారు. అదే కులానికి చెందిన మిగతా వారిని దరఖాస్తు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నరసన్నపేటలో టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రేగింది. మద్యం షాపులు కొందరు చేజిక్కించుకుని సిండికేట్‌లో కలుపుకోవడానికి యత్నిస్తున్నారని జనసేన నాయకులు మండిపడుతున్నారు.
దుకాణాల కేటాయింపులు
జిల్లాలో కల్లు గీత కులాలకు జిల్లాలో తొలి విడతగా 16దుకాణాలను కేటాయించారు. రెండో విడతగా సొండి కులం కోసం మరో రెండు దుకాణాలను మంజూరు చేశారు. మొత్తం 18 దుకాణాలకు దర ఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందు లో మొదటి విడతగా ప్రకటించిన 16 దుకాణాలకు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ తర్వాత కొన్ని కారణాలతో 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు పొడిగించారు. రెండో విడతలో కేటాయించిన రెండు దుకాణాలకు ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తులు స్వీ కరించనున్నారు. రెండో విడతలో ప్రకటించిన రెండు దుకాణాలకు గాను కలెక్టరేట్‌లో ఈనెల 8న డ్రా తీయనుండగా, మొదటి విడతలో కేటాయించిన 16దుకాణాలకు 10న అంబేడ్కర్ ఆడిటోరియంలో డ్రా తీయనున్నారు.
18 దుకాణాలకు గాను 30 దరఖాస్తులు
జిల్లాలో రెండు విడతలుగా కేటాయించిన 18 దుకాణాలకు గాను 30 దరఖాస్తులు మాత్రమే ఇప్పటివర కు వచ్చాయి. ఆరు దుకాణాలకు సింగిల్ దరఖాస్తు లు పడగా, 12 దుకాణాలకు రెండేసి చొప్పున దర ఖాస్తులు వచ్చాయి. 16 దుకాణాలకు గాను ఈనెల 8వరకు, రెండు దుకాణాలకు నేటి వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉన్న కారణంగా చివరి రోజు ల్లో ఎన్ని పడతాయో చూడాల్సి ఉంది. అయితే, కు లాల వారీగా కేటాయించిన దుకాణాలను టీడీపీకి చెందిన కొందరు హైజాక్ చేస్తున్నారు. తమకు సన్నిహితంగా ఉండే కులాల వారిని బినామీలుగా పెట్టి ఒకరిద్దరి చేత చేయిస్తున్నారు. వారికి పోటీగా అదే కులానికి చెందిన వారి నుంచి దరఖాస్తులు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ కారణం చేతనే ఇప్పటివరకు ఆశించిన మేర దరఖాస్తులు పడలేదు. వాస్తవంగా కల్లు గీత కులాల వారికి కేటాయించిన దుకా ణాలకు దరఖాస్తు చేసేందుకు దరఖాస్తు ఫీజు రూ. 2లక్షలు అయినప్పటికీ లైసెన్సు ఫీజు మాత్రం సగ మే ఉండటంతో వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని టీడీపీ నాయకులు గురి పెట్టారు. వాటిని వ్యూహాత్మకంగా దక్కించుకుని బినామీలను రంగంలోకి దించారు. జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని కల్లు గీత కులాల వారు మండిపడుతున్నా రు. దరఖాస్తుల స్వీకరణ ఆఖరి తేదీ రోజైనా వేయాలని కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, వారిపై సిండికేట్ల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి.
ఖండించిన జనసేన నాయకుడు
కల్లుగీత వారి దుకాణాలు సిండికేట్‌లో కలుపుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను జనసేన తీవ్రంగా ఖండిస్తుందని నరసన్నపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బలగ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. శ్రీశయన ఉప కులాలకు కేటయించిన దుకాణాలను కొందరు చేజేక్కించుకోవడానికి చేస్తున్న యత్నాలు సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment