రోడ్డు విస్తరణకు కేంద్రం ఆమోదం
టెక్కలి: జిల్లాలో డోలా–పోలాకి–నౌపడ (డీఎన్‌పీ) రోడ్డులో 56 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ రూ.103.20 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ కార్యాలయం గురువా రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో డీఎన్‌పీ రోడ్డుతో పాటు ఆంపురం–ఘతిమికుండాపురం మధ్య 11 కిలోమీటర్ల మేరకు రూ.23 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. డీఎన్‌పీ రోడ్డును 16వ జాతీయ రహదారితో అనుసంధానం చేసే విధంగా నిధులు మంజూరు చేయడంతో పాటు 67 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు రూ.126.20 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. నరసన్నపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో ఉద్దానం, సముద్ర తీరం, జాతీయ రహదారికి అనుసంధానంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. మూలపేట పోర్టు సమీపంలో మరో ఎయిర్‌పోర్టు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ ఎంతో కీలకంగా మారుతున్నట్లు తెలిపారు.
కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
పాతపట్నం: పాతపట్నం ఆల్‌ఆంధ్రా రోడ్డులో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం(కేజీబీవీ)ని గురువారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో ఎంత మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరి భోజన సదుపాయాలు, స్టోర్ రూమ్‌లో ఉన్న సరుకులు స్టాక్ రికార్డును, భోజన గది, వంట పా త్రలు, వంటగది పరిసరాలు, ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి తో కలిసి భోజనం చేశారు.
ఎకై ్సజ్ కేసులు రాజీ చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదా లత్ మార్చి 8న జరగనుందని, ఈ అదాలత్‌లో ఎకై ్సజ్ కేసులు ఎక్కువగా రాజీ చేయాలని, పెండింగ్‌లను తగ్గించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. లోక్ ఆదాలత్‌ను ఉద్దేశించి ఆయన గురువారం కోర్టులోని న్యాయసదన్‌లో అధికారులతో మాట్లాడారు. గత అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేశారని, ఈ సారి జరగనున్న అదాలత్‌లో కూడా కేసుల రాజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, ఎల్.అనురాధ దేవి ఎంవీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన శ్రీకాకుళం తహసీల్దారు కార్యాలయం సూపరింటెండెంట్ పొదిలాపు శ్రీనివాసరావుని ఎపీ ఆర్‌ఎస్‌ఎస్‌ఏ ప్రతినిధులు నియమించా రు. ఈ ఎంపికలు ఈనెల 4న విజయవాడలో జరిగాయి. పొదిలాపు శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment