పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలను కాలుష్యం బారిన పడకుండా రక్షించిన వారమవుతామని ఆయన అన్నారు. మొక్కలు నాటిన తర్వాత కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డుపుక మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, వెంకట రత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు వీవీరావు, మారపాక వెంకన్న, పంతంగి కృష్ణ, దావుల వీర ప్రసాద్, బచ్చలకూరి గోపి, కట్టా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment