క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Published Wed, Nov 20 2024 1:16 AM | Last Updated on Wed, Nov 20 2024 1:16 AM

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

సూర్యాపేట టౌన్‌: రోజూ క్రీడలు ఆడటం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్‌ కోర్టును ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆటలు ఆడితే ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ నిత్యం విఽధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించడానికి సమయం దొరికితే ఆటలపై దృష్టి పెట్టాలని కోరారు. క్రీడా కోర్టును తయారు చేయడంలో బాగా పని చేసిన, సమన్వయం చేసిన పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ జనార్ధన్‌ రెడ్డి, డీఎస్పీ రవి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement