ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి
భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.రాంబాబు, నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట ఆర్డీసీ డిపో గేటు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి నేటికీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు ఏకలక్ష్మి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, డిపో అధ్యక్షుడు గుండు రమేష్, నాయకులు శ్రీనివాస్, వీరస్వామి, ప్రసాద్, మల్లయ్య, నాగార్జున, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment