ఫ వీరిలో 67 మంది మహిళలు
ఫ నేడు ఎస్పీ కార్యాలయంలో ఆర్డర్స్
తీసుకోనున్న నూతన కానిస్టేబుళ్లు
సూర్యాపేటటౌన్ : ఎంతో పట్టుదల, కఠోరశ్రమతో పోలీస్ ఉద్యోగానికి ఎంపికై న యువ కానిస్టే
బుళ్లు విధుల్లో చేరన్నారు. తొమ్మిది నెలలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను అందుకోనున్నారు. అనంతరం వివిధపోలీస్ స్టేషన్‌లలో బాధ్యతలు అప్పగించనున్నారు.
శిక్షణ పూర్తి చేసుకొని..
నూతనంగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ కానిస్టేబుళ్లు 260 మందిని సూర్యాపేట జిల్లాకు కేటాయించారు. వీరిలో ఆర్ముడ్ రిజర్వ్, సివిల్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇందులో 67 మంది మహిళా కానిస్టేబుళ్లు, మిగతా 197 మంది పురుషులు ఉన్నారు.
పెన్షనర్లకు డీఏలు
విడుదల చేయాలి
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సర్కారు చెల్లించాల్సిన డీఏ లను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతా రామయ్య కోరారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కోశాధికారి హమీద్ ఖాన్, ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, రంగారెడ్డి, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment