ఐఎల్ఏ మహాసభలను విజయవంతం చేయాలి
కోదాడ : వరంగల్‌లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) ఆధ్వర్యంలో నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో జరిగే 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పలువురు న్యాయవాదులు కోరారు. బుధవారం కోదాడ కోర్టు ఆవరణలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదుల హక్కుల కోసం ఐఎల్ఏ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఆర్కే మూర్తి, ఐఎల్ఏ ఉపాధ్యక్షుడు గట్ల నర్సింహారావు, న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, పాలేటి నాగేశ్వరరావు, ఉసిరికాయల రవికుమార్, దొడ్డ శ్రీధర్, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, తాటి మురళి, వెంకటాచలం, ఆవుల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment