అమిత్ షా వ్యాఖ్యలు అవమానకరం
సూర్యాపేట టౌన్: పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవమానకరమని ప్రజా సంఘాల ఐక్య వేదిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్‌లో గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టేనన్నారు. వెంటనే అమిత్ షా ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లింగంపల్లి భద్రయ్య, రేపాక లింగయ్య, పుప్పాల వీరన్న, చామకూరి నర్సయ్య, అబ్దుల్ కరీం, నారబోయిన వెంకట్‌యాదవ్, కునుకుంట్ల సైదులు, మట్టిపల్లి సైదులు, కంబాలపల్లి శ్రీనివాస్, బి.వెంకటేశ్వరరావు, కె.యోగానంద్, బండారు శ్రీను, పుప్పాల రవికుమార్, పబ్బతి వెంకటేశ్వర్లు, పంతం నర్సయ్య, జి.వెంకటేశ్వర్లు, వీరబోయిన రమేష్ ,డి.లాలయ్య మట్టిపల్లి సైదులు, కె.యోగానంద్, కె.వేణు, బి.క్రాంతికుమార్, దామల్ల వెంకన్న, డి.మహేష్, నాయకపు పరమేష్, ఎం.నాగయ్య, ఎస్.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment