మూడు నెలలుగా నత్తనడకన
హుజూర్‌నగర్: వన్ నేషన్ వన్ స్టూడెంట్ నినాదంతో ప్రతి విద్యార్థి సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నంబర్ కేటాయింపు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. అపార్ పేరుతో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెల గుర్తింపు నంబర్ కేటాయిస్తున్నారు. తొలి దశలో 2 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అపార్ జారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి ప్రారంభించినప్పటికీ వివిధ కారణాలతో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు.
1.44లక్షల విద్యార్థులు
జిల్లాలో అన్ని రకాల యాజమాన్యాల విద్యాసంస్థలు కలిపి 1,314 ఉండగా వీటిల్లో మొత్తం 1.44లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 2,488 మందికి అపార్ ఐడీ నమోదు జారీ చేశారు. ఇప్పటి వరకు 2 శాతం కూడా పూర్తికాలేదు. అపార్ నమోదులో రాష్ట్రంలో మన జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఒకవైపు ప్రతినెలా 9, 10 తేదీల్లో మెగా అపార్ దివస్ నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో నూతనంగా విద్యార్థికి పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) ఉండేలా చర్యలు తీసుకుంటూ ఆధార్ అప్‌డేషన్ కలిగి ఉండేలా అవగాహన కల్పిస్తున్నా రు. కానీ, చాలా మంది విద్యార్థులకు ఆధార్ నంబర్ లేకపోవడంతోపాటు ప్రస్తుతం పాఠశాలలకు వెళ్లి ఆధార్ అప్‌డేట్ చేయించాల్సిన సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా అన్ని స్కూళ్లూ అపార్ నమోదులో వెనుకబడ్డాయి.
నెలాఖరులోగా పూర్తికి చర్యలు
జిల్లాలో అపార్ నమోదు ఈ నెలాఖరు వరకు నూరు శాతం పూర్తికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక టీమ్‌లను నియమిస్తాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్‌ఎంలతో పాటు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు జూమ్ మీటింగ్ కూడా నిర్వహించాం. వారు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కావాల్సిన పత్రాలు తెప్పించి నమోదు చేయించాలి.
– కె.శ్రావణ్ కుమార్,
జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్, సూర్యాపేట
ఫ రెండు శాతం కూడా పూర్తికాని అపార్ నమోదు కార్యక్రమం
ఫ ఆధార్ సమస్యతో ఆలస్యంగా ప్రక్రియ
ఫ అన్ని స్కూళ్లూ వెనుకంజలోనే..
ఫ నెలాఖరులోగా పూర్తి
చేస్తామంటున్న అధికారులు
మొత్తం స్కూళ్లు 1,314
విద్యార్థులు 1,44,412
అపార్ కేటాయించింది 2,488
Comments
Please login to add a commentAdd a comment