రైతుల అభివృద్ధికి కృషి
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రోత్సహించడం చాలా సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జీజీపీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ పడమటి పావనీరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మెరుగు మధు, జిల్లా అధ్యక్షుడు మాటూరి అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment