మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2024– 25 సంవత్సరానికిగాను మైనార్టీ యువతీ యువకులకు హార్డ్ వేర్ అసిస్టెంట్ కోర్స్ లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు అర్హత పత్రాలతో దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో ఈనెల ఆరవ తేదీలోగా సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం, జిల్లా కలెక్టర్ ఆఫీస్ మొబైల్ నంబర్ 9492611057, 9666499929లలో సంప్రదించాలని సూచించారు.
కోదాడ మార్కెట్ పాలకవర్గం నియామకం
కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చైర్‌పర్సన్‌గా నడిగూడేనికి చెందిన ఏపూరి తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్‌గా కోదాడకు చెందిన మైనార్టీ నాయకుడు షేక్ బషీర్‌ను నియమించారు. వీరితో పాటు మరో 16 మందిని సభ్యులుగా నియమించారు. వీరిలో చింతకుంట్ల సూర్యం, కాసర్ల కోటయ్య, తమ్మనబోయిన వీరబాబు, కునుగుంట్ల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ మణి, రేపాని శ్రీను, మల్లు వెంకటరెడ్డి, బాణోతు అజ్మీరాసింగ్, దొంగల నాగవేణు, పోలంపల్లి వెంకటేశ్వర్లు, పోతుగంటి అభిరామ్, కాపెల్లి నర్సిరెడ్డి, అనంతగిరి పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ మేనేజర్, కోదాడ ఏడీఏ, కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు. ఈ పాలకవర్గం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment