బర్దన్‌ జీవితం భావితరాలకు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

బర్దన్‌ జీవితం భావితరాలకు ఆదర్శం

Published Fri, Jan 3 2025 2:16 AM | Last Updated on Fri, Jan 3 2025 2:16 AM

బర్దన్‌ జీవితం భావితరాలకు ఆదర్శం

బర్దన్‌ జీవితం భావితరాలకు ఆదర్శం

భానుపురి (సూర్యాపేట) : సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్‌ జీవితం భావితరాలకు ఆదర్శమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బర్దన్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బర్దన్‌ 15వ ఏట నుంచే కమ్యూనిస్టు భావాలు కలిగి ఉండి కార్మిక నేతగా ఏఐటీయూసీ అధ్యక్షుడిగా పలు ఉద్యమాలు చేశారన్నారు. ఆ సమయంలోనే 20 సార్లు అరెస్ట్‌ అయ్యారని, నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన గొప్ప నేత అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ప్రవేశించి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు అనంతుల మల్లేశ్వరి, ఎల్లవుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు చామల అశోక్‌ కుమార్‌, కృష్ణ, రెడీమల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఫ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement