అధికారులు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కొత్త సంవత్సరంలో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అధికారులు తోడ్పడాలన్నారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా అధికారులు సతీష్ కుమార్, వీవీ అప్పారావు, కిషన్, కోటాచలం, బి.లత, ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, పీఆర్ ఈఈ వెంకటయ్య, టీఎన్జీవో అధ్యక్షుడు జానిమియా, సెక్రటరీ దున్న శ్యామ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment