బడికి ఆధునిక సొబగులు
పాఠశాలల్లో ప్రయోగశాలలు..
పాఠశాలల్లో ఒక్కో సైన్స్ ల్యాబ్‌కు రూ.14 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు వినియోగించిన ల్యాబ్ గదిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక వసతులతో ప్రయోగశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తోంది. ఈ పథకం కింద గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాఠశాలల్లో పనికిరాని వస్తువులతో చాట్ తయారు చేయించాలి. స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
ఫ పీఎంశ్రీ కింద రెండు విడతల్లో
31 స్కూళ్ల్ల ఎంపిక
ఫ మౌలిక వసతుల కల్పనకు రూ.25.25లక్షల నిధులు విడుదల
ఫ తరగతి గదులు, సైన్స్‌ల్యాబ్‌ల
ఆధునీకరణ
ఫ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌కు రూ.33.46లక్షలు మంజూరు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా పూర్తి స్థాయి వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది నుంచి ఎంపిక చేసిన పాఠశాలలకు నిధులు కేటాయిస్తోంది. విడతల వారీగా మంజూరైన నిధులతో ప్రాధాన్యాతా క్రమంలో పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత నిధులతో ల్యాబ్ సమకూరుస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో కలిపి 31 పాఠశాలలకు వసతుల కల్పనతో పాటు టీఎల్‌ఎంకు కలిపి రూ.58.71 లక్షలు విడుదలయ్యాయి.
అందుబాటులోకి సాంకేతిక విద్య..
పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో మొదటి విడతలో ఎంపికై న 22 పాఠశాలలకు రూ.19.50లక్షలు, రెండో విడత కింద ఎంపికై న తొమ్మిది పాఠశాలలకు రూ.5.75లక్షలు విడుదలయ్యాయి. అలాగే టీఎల్‌ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) కోసం మొదటి విడతలో రూ.6.22లక్షలు, రెండో విడతలో 27.24లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులతో ఎంపికై న బడుల్లో తరగతి గదులను ఆధునీకరించడం, డిజిటల్ గ్రంథాలయం, వృత్తివిద్యాకోర్సులు, సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తారు. సోలార్ విద్యుత్ ప్యానల్, క్రీడలమైదానం, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సంవత్సరం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనానికి కూరగాయలను పండించాలి. తరగతి గదుల్లో ఎల్‌ఈడీ లైట్లు బిగించడంతో పాటు పాఠ్యాంశాలకు అనుగుణంగా క్లబ్బులు ఏర్పాటు చేయనున్నారు. మానసిక వైద్యులతో సదస్సులు నిర్వహించాలిగ్రీన్ స్కూల్ పేరిట మొక్కలు నాటుతారు.
Comments
Please login to add a commentAdd a comment