స్కాన్ చేద్దాం.. మార్కులు వేద్దాం!
ఠాణాలకు వచ్చే పౌరులనుంచి ప్రజాభిప్రాయ సేకరణ
ఈ అంశాలపై ఫీడ్‌బ్యాక్
● బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత కేసు ఎలా నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారా లేదా?
● ఎఫ్‌ఐఆర్ చేశారా, లేదా?
● పోలీసులు మాట్లాడిన తీరు ఎలా ఉంది?
● ట్రాఫిక్ చలాన్ల గురించి, పాస్‌పోర్టు ధ్రువీకరణ ఏ స్థితిలో ఉంది?
● ఇతర సేవలు గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా?
పై అంశాలపై క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేసే వెసులుబాటును పోలీసు శాఖ కల్పించింది.
● అందుబాటులోకి క్యూఆర్ కోడ్
● స్కాన్ చేసి అభిప్రాయం చెప్పేందుకు వెసులుబాటు
● సిబ్బంది పనితీరు
మెరుగుపరుచుకునేందుకు దోహదం
● అంకితభావంతో
పనిచేసిన వారికి గుర్తింపు
● ఫీడ్‌బ్యాక్ ఆధారంగాస్టేషన్లకు ర్యాంకులు
భువనగిరిటౌన్ : స్టేషన్లకు వచ్చే పౌరులతో పోలీసుల వ్యవహార శైలి, వారు అందించే సేవలు ఎలా ఉంటున్నాయి.. తెలుసుకునేందుకు ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం పోలీసు శాఖ తీసుకువచ్చిన క్యూ ఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ విధానాన్ని జిల్లాలోని అన్ని స్టేషన్లలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పోలీస్‌స్టేషనల్‌లో ఎదురైన అనుభవాలను పౌరులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
ప్రయోజనాలు
క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు తెలియజేసిన అభిప్రాయాల ఆధారంగా పోలీస్ స్టేషన్లుకు ర్యాంకులు కేటాయిస్తారని సమాచారం. ప్రజా పర్యవేక్షణ అధికమైతే.. పోలీసుల పనితీరు మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి గుర్తింపు లభిస్తుందని, గాడి తప్పిన స్టేషన్లను చక్కదిద్దడానికి దోహదపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ప్రజలు ఏమంటున్నారంటే!
ఇదిలా ఉండగా పోలీసుల సేవలు, వారి పనితీరుపై తెలుసుకునేందుకు కేవలం పోలీసు స్టేషన్లలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, జనరద్దీ ప్రాంతాల్లోనూ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఏర్పాటు చేస్తే బాగుటుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ విధంగా అయితే ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఉంటుందని, తద్వారా పోలీస్ శాఖ లక్ష్యం నేరవేరుతుందని పలువురు అంటున్నారు. స్టేషన్లలోనే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వల్ల పోలీసులకు బయపడి ఎవరు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన చౌరస్తాలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, టోల్‌గేట్లు, హోటళ్లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి
ప్రస్తుతానికి పోలీసు స్టేషన్లలోనే క్యూఆర్ కోడ్
క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ప్రస్తుతానికి పోలీసు స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. స్టేషన్ హౌస్ ఆఫసీర్, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, రిపెన్షన్ గదులు, స్టేషన్ల ఆవరణలో స్టిక్కర్లను అతికించనున్నారు. జిల్లాలోని చాలా పోలీసు స్టేషన్లలో ఇప్పటికే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment