నల్లగొండ వాసులకు ప్రతిభా పురస్కారాలు
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త బాల్సన్‌నాయక్, తబలా కళాకారుడు, రిజర్వ్‌డ్ ఆర్ముడ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ పల్లె కిషోర్‌కుమార్‌కు పాన్ ఇండియన్ సోషియో కల్చ రల్ అసోసియేషన్ వారు మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్పయర్ రాయల్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాలను అమెరికన్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మధుకిక్రిషన్ చేతులమీదుగా వారు అందుకున్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ ప్రాతిమా, సౌత్ ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ అద్దంకి రాజాయోనా, కన్నడ సాహితీవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment