చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: సెల్‌టవర్ల నుంచి రేడియో రిమోట్ యూనిట్ల(ఆర్‌ఆర్‌యు)ను దొంగలించి సొమ్ము చేసుకుంటున్న నిందుతుడిని మిర్యాలగూడ రూరల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐలు పి. లోకేష్, సీహెచ్. వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామ శివారులో ఎయిర్‌టెల్ సెల్ టవర్ నుంచి రెండు రేడియో రిమోట్ యూనిట్లు చోరీకి గురైనట్లు టవర్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం వెంకటాద్రిపాలెం రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా.. బైక్‌పై వెళ్తున్న ధీరావత్‌తండాకు చెందిన ధీరావత్ నవీన్ పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా.. గత ఏడాది డిసెంబర్‌లో శ్రీనివాసనగర్ గ్రామంలోని ఎయిర్‌టెల్ టవర్ నుంచి బ్యాటరీ, జూలైలో నందిపాడు శివారులోని ఎయిర్‌టెల్ టవర్ నుంచి ఆర్‌ఆర్‌యులను దొంగిలించి హైదరాబాద్‌లో విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా పెన్‌పహాడ్ మండలం ధర్మాపురంతండాకు చెందిన లకావతు వెంకన్నతో కలిసి ఐలాపురంలోని సెల్ టవర్‌లో రెండు ఆర్‌ఆర్‌యులను దొంగలించి శ్రీనివాసనగర్‌లో గల గుట్ట వద్ద చెట్ల పొదల్లో దాచిపెట్టారు. సోమవారం వాటిని తీసుకుని ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువైన ఆర్‌ఆర్‌యులతో పాటు ద్విచక్ర వాహనం, కటింగ్ ప్లేయర్‌ను స్వాదీనం చేసుకుని మాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐలు తెలిపారు. నవీన్‌పై మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5 కేసులు, కొండమల్లేపల్లి, చింతపల్లి, తిరుమలగిరి(సాగర్), నిడమనూరు, నేరెడుగొమ్మ, మాడుగులపల్లి, దేవరకొండ, వేముపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 11 చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించామన్నారు. నవీన్‌కు సహకరించిన లకావత్ వెంకన్న పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్‌ఐ రాములు, కానిస్టేబుళ్లు సైదానాయక్, శంకర్, నాగరాజు, హోంగార్డు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పరారీలో మరో వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment