రాజ్యాంగం పూర్తిస్థాయి అమలుకు పోరు
భానుపురి (సూర్యాపేట): భారత స్వాతంత్య్ర సంగ్రామ ఆకాంక్షల ప్రతిబింబమే భారత రాజ్యాంగమని, దాని పూర్తిస్థాయి అమలుకు మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగం, గమ్యం, గమనం అనే అంశంపై ఆదివారం సూర్యాపేటలో ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ఎంతో శాసీ్త్రయంగా ఎంతో మేధోమధనంతో చర్చలు జరిపిన అనంతరం అమలులోకి వచ్చిందన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికీ సంబంధించిన వ్యక్తి కాదన్నారు. అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్న ఓటు హక్కు అంబేద్కర్ ఎంతో సాహసంతో కొట్లాడి రాజ్యాంగంలో పొందుపర్చిన అంశమని చెప్పారు. అంతకుముందు సూర్యాపేటలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద మలిదశ తెలంగాణ అమరవీరుడు కొండేటి వేణుగోపాల్‌రెడ్డి వర్ధంతిలో కోదండరాం పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ఆచార్యులు మాడభూషి శ్రీధర్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, తండు నాగరాజుగౌడ్, కిరణ్, కొంచెం చంద్రకాంత్, గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే వర్ధంతి కార్యక్రమంలో నాయకులు బైరి రమేష్, బొడ్డు శంకర్, జాటోతు శ్రీను, కొల్లు కృష్ణారెడ్డి, వినయ్‌గౌడ్, సూర్యనారాయణ, ఏనుగు మధుసూదన్, యాకోబురెడ్డి, సతీష్, ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు,
ఎమ్మెల్సీ కోదండరాం
Comments
Please login to add a commentAdd a comment