యాప్‌లో చేర్చాల్సినవి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం మీటికెట్ యాప్‌లో యాదగిరిగుట్ల నృసింహుడి ఆలయాన్ని మాత్రమే ఉంచారు. ఇంకా చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ యాప్‌లో చేర్చాల్సి ఉంది. నల్లగొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు, వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయాలు, చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు.. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచీ వివరాలు, నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ వివరాలను యాప్‌లో నమోదు చేస్తే ఎంతోమందికి ఉపయోగంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment