ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. వరంగల్ –ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై గురువారం తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి వెబెక్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వరంగల్ –ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, 10న నామినేషన్లకు చివరి రోజు, 11న నామినేషన్లు స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ చివరి రోజు అని వివరించారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో 2,679 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని, జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఓ వివి అప్పారావు, డీపీఓ నారాయణ రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, ఎలక్షన్ డీటీ వేణు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీల ఏర్పాటుపై
అభ్యంతరాలు తెలుపండి
సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పడిన 11 గ్రామ పంచాయతీలతో మండల ప్రాదేశిక నియోజక వర్గాలు(ఎంపీటీసీలు) ఏర్పాటు చేశామని ఈనెల 31 వరకు వీటిపై అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు. వచ్చిన అభ్యంతరాలను ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పరిష్కరించి 3న తుది జాబితా ప్రకటించాలని ఆదేశించారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment