జడ్జిలను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం రాష్ట్ర హైకోర్టులో పలువురు న్యాయమూర్తులను కలిశారు. జస్టిస్ టి.వినోద్, కుమార్, సూర్యాపేట పోర్ట్ పోలియో జడ్జి టి.మాధవీదేవిలతో పాటు, సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ ఇటీవలే బదిలీపై హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా వెళ్లిన ఎస్. గోవర్ధన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కోర్టు నూతన భవన నిర్మించాలని, అదనపు కోర్టులు మంజూరు చేయాలని, ప్రస్తుతం కోర్టులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, న్యాయవాదులు జె.శశిధర్, నాయిని రామ్మోహన్‌రావు, టి.ఉమాపతి, నాతిసవీందర్ కుమార్, నంద్యాల దయాకర్ రెడ్డి, విజయ్ కుమార్, నర్సింహ, చంద్రమౌలి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment