నిఘా నీడ ఏమాయే..!
కోదాడ: ఇంటర్ ద్వితీయ సంవత్సర సైన్స్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం అమలుకునోచుకునేలా కన్పించడంలేదు. ప్రతి కళాశాలలోని ప్రయోగశాలలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా కొలిక్కిరాలేదు. ఫిబ్రవరి 3నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభంకానుండగా ఎక్కడకూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ కశాశాలల్లో రెండు రోజుల్లో ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా అది అసాధ్యమేనని కొందరు అధ్యాపకులు అంటున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుండా తమ కాలేజీలను వార్షిక పరీక్షల సెంటర్‌కు ఇవ్వబోమని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రయోగశాలలే కరువు..
ఇక సీసీ కెమెరాల ఏర్పాటు ఎలా..
ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ముఖ్యమైన ప్రయోగ పరీక్షల నిర్వహణను ప్రభుత్వ, రెసిడెన్షియల్, ప్రైవేట్ కళాశాలలు పూర్తిగా గాడి తప్పించాయనే విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 72 కళాశాలల్లో ల్యాబ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్‌లు ఉన్న చోట పరికరాలు లేవు.. పరికరాలు ఉన్న చోట రసాయనాలు లేవు. ఇక ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ అంటే ఏమిటో తెలియకుండానే కోర్సు పూర్తి చేయడంతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లో నూటికి నూరుశాతం మార్కులు సాధిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి ఇంటర్ బోర్డు ఈ ఏడాది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చూస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటు పనులు కొన్ని కళాశాలల్లో గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి.
యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయిస్తున్నాం
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలన్నింటిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు మంజూరు కావడంతో యుద్ధప్రాతికన ఏర్పాటు చేయిస్తున్నాం. ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేసే పనులు నడుస్తున్నాయి. రెండు రోజుల్లో వీటి ఏర్పాటు పూర్తి చేస్తాం. ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటర్ ఉన్న ప్రతి కళాశాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందే.
– భానునాయక్, డీఐఈఓ, సూర్యాపేట
ఫ ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ ద్వితీయ
సంవత్సర ప్రయోగ పరీక్షలు
ఫ పరీక్ష కేంద్రాల్లో నేటికీ ఏర్పాటు
కాని సీసీకెమెరాలు
ఫ రెండు రోజుల్లో ఏర్పాటు పనులు
చేస్తామంటున్న అధికారులు
ఫ ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు
ప్రభుత్వ, రెసిడెన్షియర్ జూనియర్ కళాశాలలు 46
ప్రైవేట్ కళాశాలలు 26
ప్రాక్టికల్‌ఎగ్జామ్స్
రాయనున్న విద్యార్థులు 8325
ప్రాక్టికల్ సెంటర్స్ 44
ఠి
డిపార్ట్‌మెంటల్ అధికారుల నియామకమే లేదు
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లలో ప్రయోగ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రతి సెంటర్‌కు ఆ కళాశాల ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించగా ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిని డీఓ(డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్)గా నియమించేవారు. వారు అక్కడ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేవారు. ఈ సారి ల్యాబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నందున వాటి ద్వారా ఇంటర్‌బోర్డులో ఉన్న కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షిస్తామని డీఓల నియమాకం చేయలేదు. తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికాకపోగా, డీఓలు కూడా లేకుండా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment